![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద కొంతమంది హోస్ట్స్ తెలుగులో ఎం మాట్లాడినా బూతులైపోతాయి. అంటే తెలుగు భాష తెలియకపోవడమే దానికి కారణం. అలాంటి తెలుగును మాట్లాడేవారిలో కొంతకాలం క్రితం వరకు రష్మీ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. ఆ తర్వాత కన్నడ నుంచి వచ్చిన సౌమ్య రావు కూడా తెలుగు మాట్లాడితే బూతులైపోయేవి..ఆ తర్వాత సౌమ్యని తీసేసారు. రష్మీ ఐతే తెలుగు ఇప్పుడు చాలా వరకు బూతులు లేకుండా స్పష్టంగా మాట్లాడుతోంది. ఇక సౌమ్య కూడా తెలుగు షోస్ లో కంటిన్యూ కావడం కోసం తెలుగు నేర్చుకుంటోంది. ఇక వీళ్ళ బాటలో కొత్తగా వచ్చింది మరో పోరి.
ఆమె బ్రహ్మముడి కావ్య. అటు సీరియల్ లో ఇటు ప్రతీ షోలో కనిపించేస్తోంది. ఇప్పుడు డాన్స్ ఐకాన్ షోకి ఒక మెంటార్ గా తన కంటెస్టెంట్ విపుల్ తో వచ్చింది. ఇక ఈ షో లేటెస్ట్ ప్రోమోలో ఆమె మాట్లాడినట్టు తెలుగు డైలాగ్ బూతు మాములుగా లేదు. విషయం ఏంటంటే. జాను తన కంటెస్టెంట్ సోనాలి షా వేసిన సాంగ్ కి శారీలో డాన్స్ చేయమని ఓంకార్ అడిగేసరికి జాను డాన్స్ చేసింది. ఐతే ఆమె శారీ వేసుకున్నా కూడా ఆ స్వింగ్స్ అనేవి కరెక్ట్ గా తెలిసాయి. ఇక కావ్య ఆమెను పొగిడేసింది. "జాను ఇంత శారీ వేసుకున్నాక కూడా అంటే ఫుల్ క్లోజ్డ్ గా ఉన్న శారీ వేసుకున్నాక కూడా నీ స్వింగ్స్ తెలుస్తున్నాయి. అప్పుడు బట్టలు అవసరం లేదు." అనేసరికి అందరూ గట్టిగ అరిచేశారు..ఎం మాట్లాడుతున్నావ్ అంటూ మానస్ ఆమె అన్న డైలాగ్ ని సరి చేసాడు. ఇక ఓంకార్ ఆ డిస్కషన్ కి ఫుల్ స్టాప్ పెడుతూ ఐదుగురు కంటెస్టెంట్స్ కి 12 లక్ష 20 వేల 162 ఓట్లు వచ్చాయని చెప్పాడు. ఇక నెటిజన్స్ ఐతే "దీపికా అలియాస్ కావ్య మాటలను తప్పు పట్టకండి" అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |